ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 04.12.2026

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.

మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం - 23.06.2025

మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం

స్త్రీలను గౌరవించే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే తొలినాళ్ల నుంచి మనదేశంలో మహిళలకు గౌరవ స్థానమిచ్చారని నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట మహిళలను గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సత్కరించారు. న్యాయవాది, రచయిత్రి నల్లూరి రుక్మిణి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవిలను శాలువా, జ్ఞాపిక, సన్మాన పత్రాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎం. వేదవతి, గుళ్లపల్లి స్వాతి, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, అర్థలపూడి నేహా తదితరులు పాల్గొన్నారు. యడ వల్లి శ్రీదేవి బృందం బుర్రకథ ఆకట్టుకుంది.













కామెంట్‌లు