అలరించిన సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం మహాతి స్వరసుధ ఆధ్వర్యంలో రజతోత్సవల సందర్భంగా ఆదివారం జరిగిన సినీసంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత టీ.జె.పీ.ఎస్. కాలేజీ కార్యదర్శి, కరెస్పాండంట్ కే.వీ.బ్రహ్మం, ఆలయ కమిటి సభ్యులు కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, బండ్లమూడి విజయలక్ష్మి, నల్లూరి బాబ్జి, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి, కళాకారులను అభినందించి సత్కరించారు. గాయని గాయకులు పత్రినిర్మల, సీహెచ్. సుధాశ్రీనివాస్, సిహెచ్. రాజ్యలక్ష్మి, ఎం.డి. జరీనా, కె.ప్రద్యుమ్నసత్మోద్భవి, జి. హరికృష్ణ, యస్. కమల్ కిషోర్, బి. వీరయ్య, డాక్టర్. ఎ.వీరరాఘవ, బి. కృష్ణప్రసాద్ లు తమ గాన మాధుర్యంతో అలనాటి మేటి చిత్రాలలోని పలు భక్తి, సినీ గీతాలను ఆలపించారు. కీబోర్డ్ పై కే. రవిబాబు, తబలా పై ఎస్. వెంకట్, పాడ్స్ పై టీ. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాలను కే. మదన్మోహన్ రావు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి