కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
అలరించిన భక్తిగీతాలపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం జరిగిన భక్తిగీతాలపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీ యిమ్మడి అంజనీదేవి బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరింపజేశారు. వీరికి తబలపై బాలాజీ, కీబోర్డుపై అశోక్ కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి