స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
స్వచ్చంద సంస్థల సేవాభావం అభినందనీయమని ఎమ్మెల్సీగా ఎన్నికైన అలపాటి రాజేంద్రప్రసాద్ కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటి జన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ పదో ఆవిర్భావ దినోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలపాటి మాట్లాడుతూ సంస్థ సేవలను మరింతగా విస్తృతపర్చాలన్నారు. ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, పెద్ది శివరామప్రసాద్, డాక్టర్ యడ్లపల్లి సుబ్రహ్మణ్యం, దాసరి హనుమంతరావు, నూతలపాటి తిరుపతయ్య తదితరులు సంస్థ సేవలను ప్రశంసించారు. తొలుత సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అధ్యక్షుడు డాక్టర్ మన్నె సుబ్బారావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సభ్యులు మన్నవ వాత్సల్య, గడిపూడి కీర్తి సమకూర్చిన ఉపకార వేతనాలను ఆలపాటి చేతులమీదుగా విద్యార్థినులకు అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి