శ్రీమద్భగవద్గీత - క్షేత్రజ్ఞవిభాగయోగః ప్రవచనము - 19.03.2025
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామిదేవాలయం అన్నమయ్య కళావేదికపై జరుబుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో బుధవా రం శ్రీమద్భగవద్గీత త్ర యోదశ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగ యోగం ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జరుబుల బంగారుబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానము నందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడేనని తెలుసుకొనుట, జ్ఞానప్రాప్తికి సాధనములని వీటికి విపరీతమైనది అజ్ఞానమన్నారు. సదసత్తులకు, ఇంద్రియాలకు అతీతుడన్నారు. ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగి ఉన్నవారు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారని తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి