ఉగాది పురస్కారాలు ప్రదానం - యువకళావాహిని, హైదరాబాద్
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం రాత్రి ఉగాది పురస్కరించుకొని పలురంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాల ప్రదానం జరిగింది. గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారథి, గుంటూరు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు, లంకా లక్ష్మీనారాయణ, ఆజోవిభో పౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. వెలువోలు నాగరాజ్యలక్ష్మి, వట్టి జొన్నల బ్రహ్మం, మేకల మోహనరావు, డాక్టర్ బండ్ల రామచంద్, బొర్రా నరసయ్య, వడ్డ మాను రంగమణి, రామరాజు ప్రేమక్కుమార్, బండారు నాగమణి, చెరుకూరి సాంబశివరావులకు ఉగాది పురస్కారాలిచ్చి సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి