నాటక రంగం విశిష్టమైంది
తెలుగు నాటక రంగం మరింత అభివృద్ధి చెందాలని మిర్చియార్డు పూర్వ అధ్యక్షుడు మన్నవ సుబ్బారావు అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం లోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ సంయుక్త నిర్వహణలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పురస్కార ప్రదాన సభ గురువారం జరిగింది. రచయత, సినీ నటుడు యు.సుబ్బరాయశర్మ, డాక్టర్ ఎస్. రామచంద్రరావు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య. రంగస్థల ప్రముఖుడు నూతలపాటి సాంబయ్య, ఆలయ పాలక మండలి ఉపకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు నాటక రంగం విశిష్టత గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గురజాడ పురస్కారాన్ని పిన్నమనేని మృత్యుంజయరావు, బళ్లారి రాఘవ పురస్కారాన్ని బసవరాజు జయశంకర్, సీఎ స్సార్ పురస్కారాన్ని వైవీఆర్ ఆచార్యులు, గరికపాటి రాజారావు పురస్కారాన్ని సుంకర కోటేశ్వరరావు, గోవిందరావు పురస్కారాన్ని సురభి సంతోషు, రఘురామయ్య పురస్కారం తిరుమలాబీ, వైకే నాగేశ్వరరావు పురస్కారాన్ని డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, జామున రాయలు పురస్కారం జ్యోతి, జంధ్యాల పురస్కారాన్ని మల్లాది భాస్కర్లు అందుకున్నారు. తొలుత ఆలాపన వెంకటేశ్వరరావు, మునిపల్లె రమణ సినీభక్తి గీతాలాపాన చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి