ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి
సామాజిక చైతన్యంతో విప్లవాత్మక కవిత్వం రాసి తెలుగు జాతికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప కవి తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి అని పలువురు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న మయ్య కళావేదికపై తుమ్మల కళాపీఠం ఆధ్వ ర్యంలో తుమ్మల వర్ధంతి సందర్భంగా పోతన భాగవత సమారాధన, ఏటుకూరి సాహిత్య సమాలో చన, కార్యక్రమాలు జరిగాయి. తుమ్మల కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ సభకు అధ్యక్షత వహించి కళాపీఠం నిర్వహిస్తున్న కార్యక్ర మాలను వివరించారు. పోతన సాహిత్య సమారా ధన ఆంశంలో టీజేపీఎస్ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ గోనుగుంట్ల వైదేహి పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలో తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు వివరించారు. సాహితీవేత్త డాక్టర్ బీరం సుందర్రావు మాట్లాడుతూ ఏటుకూరి సాహిత్యంలోని కవితాత్మక అంశాలు వివరించారు. అనంతరం 'తుమ్మల కవిత్వంలో సామాజిక చైతన్య స్ఫూర్తి' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్యకు రూ.5 వేలు, డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్య కవికి రూ.3 వేలు, బొడ్డపాటి చంద్రశేఖర్కు రూ.2 వేలు నగదు ఇచ్చి నిర్వాహకులు సత్కరించారు. జేకేసీ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఉగాది కవితల పోటీలో విజేతలకు నగదు బహుమతులిచ్చి బహుమతులిచ్చి సత్కరించారు. కార్యక్రమాలను కళాపీఠం కార్యదర్శి డాక్టర్ సూర్యదేవర రవికుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారా యణ, ఆలయ పాలకవర్గం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగే శ్వరరావు, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి, పి. నాగసుశీల, పారా అశోక్, ఏలూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి