సంకల్పంతోనే విజయం
సంకల్పం గట్టిగా ఉంటే.. విజయం తథ్యమని మహాభారతంలో పాశుపతాస్త్ర సాధన సమయంలో అర్జునుడు నిరూపించాడని సంస్కృతాంధ్ర పండితుడు గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై మంగళవారం రాత్రి ఆయన మహాభారతంలోని అరణ్యపర్వంపై విశ్లేషణాత్మక ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తొలుత ఆలయ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి ప్రవచనం చేస్తూ అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన విధానం, తర్వాత ఇంద్రుడిని కలిసినప్పటి విశేషాలను వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి