భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
యుద్ధకాండపై ప్రవచనం బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవ రపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. ఈ సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచనకర్త బాచం పల్లి సంతోషకుమార్ శర్మ యుద్ధకాం డలో సీతను కనుగొన్న హనుమంతు డిని శ్రీరాముడు ప్రశంసిస్తూ ఆలిం గనం చేసుకోవడం, యుద్ధానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం, వారధి నిర్మాణం వంటి విశేషాలను వివరించారు. ముప్పవరపు సింహాచ లశాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిం చారు. ముఖ్యఅతిథిగా డి. రాధాకృష్ణ (కాకినాడ) పాల్గొన్నారు.