కిష్కింధ కాండ పై చంద్రశేఖరశర్మ ప్రవచనం
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కీ.శే. ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని వారి కుమారుడు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీత శ్రీ మద్రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞంలో భాగంగా సోమవారం చంద్రశేఖరశర్మ కిష్కింధకాండలోని అనేక అంశాలను ప్రసంగిస్తూ హనుమంతుడు శ్రీరామలక్ష్మణులను కలిసిన విధానం, శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ, సీతాన్వేషణ, హనుమత్ సంకల్పం వంటి అనేక ఘట్టాలను కనులకు కట్టినట్లు అనేక ఉపమానాలతో వివరించి ఆహుతులను అలరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ ఆడిటర్ గబ్బిట శివరామకృషమూర్తి, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు భిన్నంగా ముప్పవరపు వెంకట సింహాచలశాస్త్రి తన తండ్రి కేశవరావు గారి శతజయంతి ఉత్సవాలలో ఎన్నిసార్లు విన్నా క్రొత్తగా అనిపించే రామాయణ కథను, ఆ జ్ఞానాన్ని నలుగురికి అందించటం ఒక విశేషమన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి