ప్రతిభామూర్తులకు సత్కారాలు
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 70 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలను సత్కరించారు. బృందావన్
గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి
సుబ్బారావు సేవాసంస్థ తరపున గుంటుపల్లి ఆరుణకుమారి మంగళవారం జ్యోతి వెలిగించి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ పాలకమండలి గౌరవాధ్యక్షురాలు గద్దె
రామతులశమ్మ (ఆధ్యాత్మికం), వేమూరి రామలక్ష్మి
(సంగీతం), డాక్టర్ సీహెచ్. సుశీలమ్మ.
(సాహిత్యం), వి.యన్.డి. శ్యామసుందరీ దేవి
(విద్య), మాధవపెద్ది మీనాక్షి (సంగీతం)
తో పాటు మరికొందరికి సత్కారాలు పొందారు. తొలుత గద్దె రామతులశమ్మ ఇంటి వద్ద ఆమెను
సత్కరించి, రామతులశమ్మ జీవన యానం
పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత
వహించారు. ప్రొఫెసర్ ఎన్. విజయలక్ష్మి సంధానకర్తగా వ్యవహరించి గుళ్లపల్లి
సుబ్బారావు సేవా సంస్థ ప్రతి నెలా 70 సంవత్సరాలు దాటిన, వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను సన్మానించాలని
తీర్మానించడం అభినంద నియమన్నారు. కార్యక్రమంలో గుళ్ళపల్లి స్వాతి, అర్ధలపూడి నేహ, గుళ్ళపల్లి రాఘవరావు
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ
వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం శిష్యబృందం స్వాగతాంజలి నృత్యం
ప్రదర్శించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి