రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన అంకురారోపణతో ప్రారం భమై, 12న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల శ్రీవారి దివ్య శాంతి కల్యాణోత్సవం, 13న మేళతాళాలు, జానపద కళా రూపాలతో అపూర్వ రథోత్సవం, 14న చండీ హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన, శ్రీపద్మావతి అమ్మవారికి విశేష అభిషేకాలు, శ్రీపుష్పయాగం, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు జరుగు తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, స్వామిజీలు, పీఠాధిపతులు, అధికారులు హాజరవుతారని తెలిపారు.
యుద్ధకాండపై ప్రవచనం
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవ రపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. ఈ సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞంలో గురువారం రాత్రి ప్రవచనకర్త బాచం పల్లి సంతోషకుమార్ శర్మ యుద్ధకాం డలో సీతను కనుగొన్న హనుమంతు డిని శ్రీరాముడు ప్రశంసిస్తూ ఆలిం గనం చేసుకోవడం, యుద్ధానికి వానర సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం, వారధి నిర్మాణం వంటి విశేషాలను వివరించారు. ముప్పవరపు సింహాచ లశాస్త్రి, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభిం చారు. ముఖ్యఅతిథిగా డి. రాధాకృష్ణ (కాకినాడ) పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి