అరణ్యకాండపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శతజయంతి సందర్భంగా ఆదివారం శ్రీమద్రామాయణ నవాహా జ్ఞానయజ్ఞ ప్రవచన ప్రవాహం అరణ్యకాండపై ప్రవచనం జరిగింది. ప్రముఖ సంస్కృత పండితులు దోర్బల ప్రభాకరశర్మ, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త బుఱ్ఱా భాస్కరశర్మ గారు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలోని అరణ్యకాండపై ప్రవచనం చేస్తూ ఆగస్త్యేశ్వర ఆశ్రమ సందర్శనం, పంచవటిలో నివాసం, సుర్పనక గర్వభంగం, మాయాలేడి మోసం, సీతాపహరణం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి