సుందరకాండపై ప్రవచనం
వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండ ఎంతో శక్తివంత మైన మంత్ర నిధి లాంటిదని సుప్రసిద్ధ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ముప్పవరపు కేశవరావు శత జయంతి సందర్భంగా రామాయణ నవాహ జ్ఞానయజ్ఞం జరుగుతోంది. మంగళవారం నాటి కార్యక్రమంలో ఆయన సుందరకాండపై ప్రవచనం చేశారు. ఆమన మాట్లాడుతూ సుందరకాండ అనే పేరే రామాయణంలోని మిగిలిన కాండలకన్నా ప్రత్యేకమైనదని వివరించారు. దీనిలో ఉన్న 68 సర్గలు దేనికదే మంత్ర శాస్త్ర నిధుల్లాగా పారాయణకు అనువుగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, నిర్వాహకుడు ముప్పవరపు సింహాచలశాస్త్రి, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉనమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, సాహితీ సమాఖ్య ప్రధానకార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావును సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి