ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరణ్యకాండపై ఆధ్యాత్మిక ప్రవచనం - 26.01.2025

అరణ్యకాండపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శతజయంతి సందర్భంగా ఆదివారం శ్రీమద్రామాయణ నవాహా జ్ఞానయజ్ఞ ప్రవచన ప్రవాహం అరణ్యకాండపై ప్రవచనం జరిగింది. ప్రముఖ సంస్కృత పండితులు దోర్బల ప్రభాకరశర్మ, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త బుఱ్ఱా భాస్కరశర్మ గారు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలోని అరణ్యకాండపై ప్రవచనం చేస్తూ ఆగస్త్యేశ్వర ఆశ్రమ సందర్శనం, పంచవటిలో నివాసం, సుర్పనక గర్వభంగం, మాయాలేడి మోసం, సీతాపహరణం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి పర్యవేక్షించారు.

అయోధ్య కాండలో ఆదర్శాలు ఎన్నో - 25.01.2025

 అయోధ్య కాండలో ఆదర్శాలు ఎన్నో

రామాయణంలోని అయోధ్యకాండలో అడుగడుగునా ఎన్నో ఆదర్శాలు కనిపిస్తాయని సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద ముప్పవరపు కేశవరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతు న్నాయి. ప్రముఖ హరికథకుడు ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి నిర్వహణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వాల్మీకి రచించిన రామాయణంలోని అయోధ్య కాండ 63వ సర్గ నుంచి చివరి వరకు జరిగిన వివిధ అంశాలను డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు విశ్లేషించి చెప్పారు. ఈ కాండలో కనిపించే ప్రతి పాత్రలోనూ నేటి మానవాళి అనుసరించ తగ్గ ఆదర్శాలు ఎన్నో ఉన్నాయన్నారు. రామలక్ష్మణుల వనవాస దీక్ష, వన ప్రయాణం, గుహుని ఆతిథ్యం, చిత్రకూట నివాసం, దశర దుని మరణం, పాదుకాపట్టాభిషేకం వరకు ఉన్న పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదాయ పన్ను శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(బెంగళూరు) కె.ఎస్.ఎ. శేష శైలేంద్ర మాట్లాడుతూ పురాణాలు, ఉపనిషత్తులోని కథాంశాలు, వాటిలోని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాలను నేటి తరానికి తెలి యజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత ఆలయ పాలకమండలి. అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు.  సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...