సందేశాత్మకంగా సాగిన చిగురు మేఘం నాటిక
స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె. ఆర్.కె.ఈవెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 20వ నాటకోత్సవాల సందర్భంగా అదివారం ప్రదర్శించిన చిగురుమేఘం నాటిక, కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీ ప్రణీత, పుణ్యవతి, సోనిక, నాగ దివ్యశ్రీ, జ్ఞానితి, లాస్య, భోగ్య శ్రీ, మనస్విని, సాన్వి, జాహ్నవి లు పలు కీర్తనలకు కూచిపూడి ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారు కావూరి సత్యనారాయణ రచనకు, ఏపూరి హరిబాబు దర్శకత్వం వహించిన చిగురుమేఘం నాటికను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పరిషత్ నిర్వాహకులు రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, బొప్పన నరసింహారావు, (బుజ్జి) జి.మల్లికార్జున రావు, వేములపల్లి విఠల్ తదితరులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి