మానవధర్మ దర్శిని సుందరకాండ
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతిని పురస్కరించుకొని రామాయణ ప్రవచన నవాహ జ్ఞానయజ్ఞం బుధవారం రాత్రి కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ పండితుడు సామవేదం షణ్ముఖశర్మ సుందరకాండపై ప్రవచనం చేశారు. సుందరకాండలో అక్షరాక్షరంలోనూ మానవాళి పాటించాల్సిన ధర్మాలు, బీజాక్షరాలతో కూడిన మంత్ర సమానాలైన శ్లోకాలు ఉన్నాయన్నారు. హనుమాన్ అనే శబ్దానికి వేద పరంగా జ్ఞానవంతుడు అని, ఆంజనేయుడు అంటే.. ఇంతకుముందున్న దానిని కనుగొనేవాడని అర్ధాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విద్యా రణ్య పీఠ పండితుడు, ఘనపారి విష్ణు భట్ల లక్ష్మీనారాయణ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముప్పవరపు సింహాచల శాస్త్రి నిర్వహించారు. భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి