తాత్విక చింతనకు దర్పణం అయోధ్యకాండ
రామాయణంలోని అయోధ్యకాండకు కేవలం దశరథమహారాజు పాలించిన అభేద్య నగరం గురించి తెలిపే కాండ అని మాత్రమే అర్ధం చెప్పుకోకూడదని, దానిలో గొప్ప తాత్విక చింతన ఇమిడి ఉందని సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ తెలిపారు. బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ముప్పవరపు కేశవరావు శత జయంతి సభలో ఆయన రామాయణంలోని అయోధ్యకాం డలో ఒకటి నుంచి 62వ సర్గ వరకు విశేషాలు శుక్రవారం రాత్రి వివరించారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహకుడు కేఎస్ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ విశిష్టత వివరించారు. ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్, మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముప్పవరపు సింహాచలశాస్త్రి కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి