రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 11వ తేదీన అంకురారోపణతో ప్రారం భమై, 12న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల శ్రీవారి దివ్య శాంతి కల్యాణోత్సవం, 13న మేళతాళాలు, జానపద కళా రూపాలతో అపూర్వ రథోత్సవం, 14న చండీ హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన, శ్రీపద్మావతి అమ్మవారికి విశేష అభిషేకాలు, శ్రీపుష్పయాగం, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు జరుగు తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, స్వామిజీలు, పీఠాధిపతులు, అధికారులు హాజరవుతారని తెలిపారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా సోమవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి