రామాయణం అక్షరాలా అమృతకలశం
రామాయణం అక్షరాలా ఒక అమృతకలశం లాంటిదని మహాసహ స్రావధాని మాడుగుల నాగఫణిశర్మ తెలిపారు. గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి రామా యణ నవాహ జ్ఞానయజ్ఞం ప్రారంభ మైంది. ముప్పవరపు వేంకట సింహా చలశాస్త్రి ఆధ్వర్యంలో ఆయన తండ్రి ముప్పవరపు కేశవరావు శతజయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల కార్యక్రమంలో తొలిరోజు రామాయణ ఆవిర్భావం, విశిష్టత, బాలకాండ విశేషాల గురించి మాడుగుల నాగపణిశర్మ విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. రామాయణంలోని 24 వేల శ్లోకాల్లో వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలను.. వెయ్యి శ్లోకాలకు ఒక బీజాక్షరం వంతున ఎలా నిక్షిప్తం చేసిందీ వివరించారు. వాల్మీకి మహర్షికి నారదుడు, బ్రహ్మ దేవుడు రామా యణ రచన విషయంలో ప్రేరణ కలిగించారన్న అంశాలను విపులీకరించారు. రామయణం.. ప్రపంచ వాజ్ఞయానికి దారిదీ. పంగా వాల్మీకి మహర్షి చెప్పారన్నారు. రాముడి ఆదర్శాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. కార్య క్రమంలో అమరావతి జ్యుడీషియల్ ఆకా డమీ డైరెక్టర్ అవధానుల హరనాథశర్మ పాల్గొని రామాయణంలోని సుందరకాండ విశేషాలను వివరించారు. తొలుత కార్యక్ర మాలను ముప్పవరపు సింహాచలశాస్త్రి, నాగఫణిశర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి వెలి గించి ప్రారంభించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి