ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం - 07.02.2026

అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర...

విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు - సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం - 29,30.01.2026

విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు.. స్థానిక బృందావన్గార్డెన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై గురువారం భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో గోష్ఠి సభ్యులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త నారాయణం శేషుబాబు ప్రవచిస్తూ భీష్మ ఏకాదశి కురు పితామహుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి, శ్రీకృష్ణుని సాక్షిగా పాండ వులకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో వస్తుందని పేర్కొన్నారు. భీష్ముని స్మరిస్తూ, విష్ణు ఆరాధన చేయడం ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సత్యం, ధర్మాన్ని పాటించే ప్రేరణ పొందుతారని చెప్పారు.

నారాయణ స్తోత్రం పఠనంతో సర్వ శుభాలు - 27,28.01.2026

నారాయణ స్తోత్రం పఠనంతో సర్వ శుభాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం ఆదిశంకరాచార్యులచే విరచితమైన నారాయణ స్తోత్రంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ శ్రీమహావిష్ణువును కీర్తించే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అన్నారు. భక్తులలో అంతర్గత శాంతి, భావోద్వేగ బలం, ఆధ్యాత్మిక రక్షణను పెంపొందిస్తుందన్నారు. ఈ స్తోత్రం నారాయణ నారాయణ జయ గోవింద హరే అనే పల్లవితో ప్రారంభమై, విష్ణువు యొక్క దివ్య రూపాలను, గుణాలను వర్ణిస్తూ కష్టాలను, పాపాలను తొలగిస్తుందన్నారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని విశ్వాసమన్నారు.

అలరించిన పౌరాణిక పద్య నాటకాలు - 26.01.2026

అలరించిన పౌరాణిక పద్య నాటకాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో సంస్థ 32 వ వార్షిక ఉత్సవాలలో భాగంగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ నిర్వహణలో పౌరాణిక పద్య నాటక సన్నివేశ ప్రదర్శన జరిగింది. మొదటిగా గయోపాఖ్యానంలోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్, అర్జునుడిగా ఉల్లంగుల బ్రహ్మయ్య, రెండవదిగా శ్రీకృష్ణరాయబారం పడకసీనులోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా గుర్రపుశాల శ్రీనివాస్, సుయోధనుడుగా అట్ల రామకృష్ణారెడ్డి, అర్జునుడుగా బ్రహ్మయ్యలు పౌరాణిక పద్యాలతో ఆహుతులను అలరించారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ ప్రభుదాస్ దంపతులను, కళాకారులను ఘనంగా సత్కరించారు.

భక్తి శ్రద్ధలతో రథసప్తమి, ఆదిత్య హృదయ పారాయణ - 25.01.2026

భక్తి శ్రద్ధలతో రథసప్తమి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ఉదయం రధసప్తమి పురస్కరించుకొని సూర్యభగవానునికి సువాసినులచే విశేష పొంగలి నివేదన జరిగింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో ఆదిత్య హృదయ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ జరిగాయి. ధార్మిక ప్రాంగణంలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో రుద్రం, సౌరహోమం నిర్వహించి అనంతరం పూర్ణాహుతి చేశాడు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, పాలకవర్గం పాల్గొన్నారు.

సందడిగా భరతమాత పూజా దినోత్సవం - 25.01.2026

సందడిగా భరతమాత పూజా దినోత్సవం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల ముగింపు సభ ఆదివారం జరిగింది. సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీధర్ బాబు బృందం కార్యక్రమాలను నిర్వహించింది. చిన్నారుల దేశభక్తుల వేషధారణ, సంప్రదాయ, జానపద నృత్య పోటీలు తదితర అంశాల్లో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. వీవీఐటీ ప్రిన్సిపల్ మల్లికార్జునరెడ్డి, డాక్టర్ శేషయ్య, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఉపాధ్యాయులు కృష్ణవేణి, రేణుకాదేవి, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, గడియాల రామకృష్ణ బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు.

అలరించిన కూచిపూడి నృత్య కదంబం - 24.01.2026

అలరించిన కూచిపూడి నృత్య కదంబం బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై శనివారం కూచిపూడి నృత్య కదంబం నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఎం. నాగలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. సంగీత కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఆర్ ఎం రమేష్కుమార్, కేంద్రం కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ పాల్గొ నగా, కళాకారులను సత్కరించారు.

మహాభారతం అరణ్యపర్వంపై ప్రవచనం, సరస్వతీదేవి పూజ - 21, 22, 23.01.2026

మహాభారతం అరణ్యపర్వంపై ప్రవచనం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమహాభారతంలో వ్యాసప్రాస్తం, కవిత్రయం, పెద్దు తెలిపిన అంశాలపై ఉపన్యాస భూషణ శ్రీమన్ గుదిమెళ్ల కూర్మనాథస్వామి ప్రసంగించారు. ఈనెల 23న వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవీ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు.