విష్ణువును ఆరాధిస్తే ప్రేరణ పొందుతారు..
స్థానిక బృందావన్గార్డెన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదికపై గురువారం భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో జరగ్గా, ఆలయ పాలక మండలి వారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో గోష్ఠి సభ్యులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త నారాయణం శేషుబాబు ప్రవచిస్తూ భీష్మ ఏకాదశి కురు పితామహుడు భీష్ముడు అంపశయ్యపై ఉండి, శ్రీకృష్ణుని సాక్షిగా పాండ వులకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో వస్తుందని పేర్కొన్నారు. భీష్ముని స్మరిస్తూ, విష్ణు ఆరాధన చేయడం ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సత్యం, ధర్మాన్ని పాటించే ప్రేరణ పొందుతారని చెప్పారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి