ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం - 31.01.2026

సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయిరాగా సంగీత కళాశాల పంచమ వార్షికోత్సవాలు సంస్థ ప్రిన్సిపాల్ మునిపల్లె రమణి ఆధ్వర్యంలో ఉల్లాసంగా జరిగాయి. అతిథులుగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రమణి మునిపల్లె ప్రార్ధనాగీతంతో స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూనియర్ శిష్యలు నాగవరపు తిశీత, కట్ట జూహితేశ్వరి, కట్టమోహిత యశస్వి, సూది గీతికా దీపాలక్ష్మీ శ్రీష్టి, సీనియర్స్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఎం.రామశేషు గీతాలను ఆలపించి స్వరార్చన చేశారు. తబలాపై రమణ, ప్యాడ్స్పై ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. మునిపల్లె మూర్తి వ్యాఖ్యనంతో బాబూరావు ఇస్మాయిల్, కార్య క్రమ పర్యవేక్షణ చేశారు.

నారాయణ స్తోత్రం పఠనంతో సర్వ శుభాలు - 27,28.01.2026

నారాయణ స్తోత్రం పఠనంతో సర్వ శుభాలు

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం ఆదిశంకరాచార్యులచే విరచితమైన నారాయణ స్తోత్రంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ శ్రీమహావిష్ణువును కీర్తించే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అన్నారు. భక్తులలో అంతర్గత శాంతి, భావోద్వేగ బలం, ఆధ్యాత్మిక రక్షణను పెంపొందిస్తుందన్నారు. ఈ స్తోత్రం నారాయణ నారాయణ జయ గోవింద హరే అనే పల్లవితో ప్రారంభమై, విష్ణువు యొక్క దివ్య రూపాలను, గుణాలను వర్ణిస్తూ కష్టాలను, పాపాలను తొలగిస్తుందన్నారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని విశ్వాసమన్నారు.








కామెంట్‌లు