సందడిగా భరతమాత పూజా దినోత్సవం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల ముగింపు సభ ఆదివారం జరిగింది. సంస్కార భారతి అధ్యక్షుడు ఇండ్ల శ్రీధర్ బాబు బృందం కార్యక్రమాలను నిర్వహించింది. చిన్నారుల దేశభక్తుల వేషధారణ, సంప్రదాయ, జానపద నృత్య పోటీలు తదితర అంశాల్లో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. వీవీఐటీ ప్రిన్సిపల్ మల్లికార్జునరెడ్డి, డాక్టర్ శేషయ్య, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ఉపాధ్యాయులు కృష్ణవేణి, రేణుకాదేవి, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, గడియాల రామకృష్ణ బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి