అంకయ్యకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం ప్రదానం
ప్రపంచంలోని ఏడువేల భాషల్లో భారతదేశంలో ఎనిమిది వందల భాషల్లో అంకమ్మ కథలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలుగు నెరవు వ్యవస్థాపకులు స.వెం.రమేష్ అన్నారు. దివంగత జె.వెంకటేశ్వరరావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయం త్రం బృందావన్గార్డెన్స్స్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవ స్థానం అన్నమయ్య కళావేదికపై సంపూర్ణ అంకమ్మ కథల గాయకుడు చలంచర్ల దానం అంకయ్య( కావలి)కు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, నగదు అందించి సత్కరించారు. ముఖ్య వక్త రమేష్ మాట్లాడుతూ నాగరికత, అభివృద్ధి పేరుతో మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నాడని అన్నారు. అయితే పుట్టుకకు మూలమైన సంస్కృతి మూలాలను మర్చిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర క్షరాస్యుడైన అంకమ్మ కథల్లో ఇతివృత్తం ఆయన జ్ఞాన తపస్సుకు అద్దం పడుతుందని అన్నారు. విశ్వనాథ సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దినేని సింహకౌటిల్యచౌదరి మాట్లాడుతూ అరు దైన గొప్ప కథల గాన కళాకారుడైన అంకయ్యను సత్కరించడం సాహిత్య అకాడమీకి గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. అనంతరం వంతలకోటి సాంబమూర్తి కళామండలి డాక్టర్ బొంతల కోటిశం కరరావు భాగవత బృందంతో తూర్పు భాగవతం భామాకలాపం నృత్య ప్రదర్శన అలరించింది. తొలుత దేవస్థానం ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేయగా, బి.మురళీకృష్ణ, అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, కోశాధికారి డాక్టర్ సెట్లం చంద్రమోహన్ పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి