అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
భక్తి శ్రద్ధలతో రథసప్తమి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ఉదయం రధసప్తమి పురస్కరించుకొని సూర్యభగవానునికి సువాసినులచే విశేష పొంగలి నివేదన జరిగింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి నిర్వహణలో ఆదిత్య హృదయ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ జరిగాయి. ధార్మిక ప్రాంగణంలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో రుద్రం, సౌరహోమం నిర్వహించి అనంతరం పూర్ణాహుతి చేశాడు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, పాలకవర్గం పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి