అలరించిన కూచిపూడి నృత్య కదంబం
బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై శనివారం కూచిపూడి నృత్య కదంబం నిర్వహించారు. నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఎం. నాగలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. సంగీత కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైల్వే ఏడీఆర్ ఎం రమేష్కుమార్, కేంద్రం కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ పాల్గొ నగా, కళాకారులను సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి