అలరించిన పౌరాణిక పద్య నాటకాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో సంస్థ 32 వ వార్షిక ఉత్సవాలలో భాగంగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ నిర్వహణలో పౌరాణిక పద్య నాటక సన్నివేశ ప్రదర్శన జరిగింది. మొదటిగా గయోపాఖ్యానంలోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్, అర్జునుడిగా ఉల్లంగుల బ్రహ్మయ్య, రెండవదిగా శ్రీకృష్ణరాయబారం పడకసీనులోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా గుర్రపుశాల శ్రీనివాస్, సుయోధనుడుగా అట్ల రామకృష్ణారెడ్డి, అర్జునుడుగా బ్రహ్మయ్యలు పౌరాణిక పద్యాలతో ఆహుతులను అలరించారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ ప్రభుదాస్ దంపతులను, కళాకారులను ఘనంగా సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి