ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.

గాయత్రీ మహిళా సంగీత సన్మండలి కృషి ప్రశంసనీయం - 16.03.2025

సంగీత సన్మండలి కృషి ప్రశంసనీయం సంగీత, సాహిత్య, సేవా రంగాల్లో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. బృందావన్ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం ముగింపు సభ జరిగింది. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వె. శేషురాణి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. డాక్టర్ కె. వీరన్ (విజయవాడ), ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ . మస్తానయ్య ప్రసంగిం చారు. సంస్థ సంచికను డాక్టర్ కె.వీరన్ ఆవిష్కరించారు. అనంతరం మల్లాది సింధురాగేశ్వరి (విజయవాడ) కు బంగారు పతకం ప్రదానం చేసి సత్కరించారు. సింధురాగేశ్వరి శాస్త్రీయ గాత్ర కచేరీలో పలు వాగ్గేయకారుల కృతులను గానం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంస్థ ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏ.వీ. మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం - 15.03.2025

గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం జరిగింది. సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్ అన్నవరపు రామస్వామికి, మృదంగ విద్వాంసుడు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు, చిత్రవీణ విద్వాంసుడు డాక్టర్ ఎన్.రవికిరణ్ లను సన్మానించారు. కార్యక్రమాలను మోదుమూడి అంజనా సుధాకర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మాదల రత్నగిరిబాబు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ఎన్.రవికిరణ్ వీణ కచేరి జరిగింది. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణిల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. సంస్థ ప్రతినిధులు ఎమ్. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, మంగాదేవి, మాధ వీకృష్ణ విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు. 

వైభవంగా బ్రహ్మోత్సవాలు - 14.03.2025

వైభవంగా బ్రహ్మోత్సవాలు   బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. ముగింపు సంద ర్భంగా భారతీ ధార్మిక విజ్ఞాన విజ్ఞాన పరి షత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి  చేశారు. వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. పద్మా వతి అమ్మవారికి అభిషేకాలు, రాత్రి వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాది పతి విద్యారణ్యభారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వంకా యలపాటి బలరామకృష్ణయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పర్యవేక్షించారు. 

నేత్రపర్వం.. శ్రీనివాసుడి రథోత్సవం - 13.03.2025

నేత్రపర్వం.. శ్రీనివాసుడి రథోత్సవం  బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి దివ్య రధోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా అలంక రించిన రథంపై ఉభయదేవేరీ సమేతంగా స్వామిని ఊరేగిం చారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు నిర్వహణలో రధోత్సవం కనక తప్పెట్లు, మంగళ వాద్యాలు, విద్యుత్తు దీపకాంతులు, నామ సంకీర్తనలు, కర్ర సాము, కోలాటాలు, బాణసంచా వెలుగుల మధ్య బృందావన్ గార్డెన్స్ ప్రధాన వీధుల్లో సందడిగా సాగింది. శృంగేరి విరూపాక్ష శ్రీపీఠం పీఠాధిపతి గంభీరానంద భారతీ మహాస్వామి, నిర్వికల్పానందస్వామి, ధనకుధరం సీతారామానుజాచార్యస్వామి అనుగ్రహభాషణం చేశారు. సాహితీవేత్తలు ఎం.వి.సత్యవతి, ఏవీకే సుజాత బ్రహ్మోత్స వాల విశిష్టత వివరించారు. మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, కుమార్ పంప్స్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, కారంశెట్టి లోకేశు సభలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సాహి తీవేత్త నోరి కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలన...

చూసిన కనులదే భాగ్యము - శ్రీవారి కళ్యాణం - 12.03.2025

చూసిన కనులదే భాగ్యము - శ్రీవారి కళ్యాణం బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మూలవిరాట్లకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. ఉత్సవ సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. కారం చేడు వశిష్టాశ్రమ ఉత్తర పీఠాధిపతి సర్వ అధికార ప్రతినిధి విశ్వంభరానందగిరి స్వామి, సాహితీవేత్తలు నారాయణం ప్రసా దాచార్యులు, నారాయణం శేషుబాబు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఊటుకూరి నాగేశ్వరరావు, సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి తదితరులు పర్యవేక్షించారు.  

బృందావన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - 11.03.2025

బృందావన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం  బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత నాదస్వర స్వాగతాంజలి, మలిశెట్టి లక్ష్మీనారాయణ బృందం ఓం నమో వేంకటేశాయ గేయగానం జరిగాయి, అగ్నిహోత్రం శోభనాచల లక్ష్మీనరసింహాచార్యుల ప్రధాన అర్చకత్వంలో పరుచూరి మాధవస్వామి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ఉప న్యాస కార్యక్రమాలు, రంగస్థల ప్రముఖుడు ఉప్పాల రత్తయ్య ప్రార్ధనా గీతంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సభకు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. గండిపాలెం ఆనందాశ్రమ పీఠాధిపతి ప్రసన్నానందగిరి స్వామి, గుంటూరు ఆర్ష విద్యాకేంద్ర పీఠాధిపతి బ్రహ్మనిష్ఠానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ విశ్రాంత ప్రాంతీయ సంచాలకుడు దేవినేని కరుణ చంద్రబాబు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కే.జి. శంకర్, విశ్రాంత ప్రొఫెసర్ ఆరేటి కృష్ణకుమారి, గుంటూరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి ఉమా పాల్గొన్నారు. గుది మెళ్ల శ్రీకూర్మనాథస్వామి, ఏవీకే సుజాత, నోరి కోదండరామ్ ప్రసంగించారు.