బృందావన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత నాదస్వర స్వాగతాంజలి, మలిశెట్టి లక్ష్మీనారాయణ బృందం ఓం నమో వేంకటేశాయ గేయగానం జరిగాయి, అగ్నిహోత్రం శోభనాచల లక్ష్మీనరసింహాచార్యుల ప్రధాన అర్చకత్వంలో పరుచూరి మాధవస్వామి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ఉప న్యాస కార్యక్రమాలు, రంగస్థల ప్రముఖుడు ఉప్పాల రత్తయ్య ప్రార్ధనా గీతంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సభకు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహిం చారు. గండిపాలెం ఆనందాశ్రమ పీఠాధిపతి ప్రసన్నానందగిరి స్వామి, గుంటూరు ఆర్ష విద్యాకేంద్ర పీఠాధిపతి బ్రహ్మనిష్ఠానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. మున్సిపల్ పరిపాలన శాఖ విశ్రాంత ప్రాంతీయ సంచాలకుడు దేవినేని కరుణ చంద్రబాబు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కే.జి. శంకర్, విశ్రాంత ప్రొఫెసర్ ఆరేటి కృష్ణకుమారి, గుంటూరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారి ఉమా పాల్గొన్నారు. గుది మెళ్ల శ్రీకూర్మనాథస్వామి, ఏవీకే సుజాత, నోరి కోదండరామ్ ప్రసంగించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి