చూసిన కనులదే భాగ్యము - శ్రీవారి కళ్యాణం
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మూలవిరాట్లకు అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. ఉత్సవ సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. కారం చేడు వశిష్టాశ్రమ ఉత్తర పీఠాధిపతి సర్వ అధికార ప్రతినిధి విశ్వంభరానందగిరి స్వామి, సాహితీవేత్తలు నారాయణం ప్రసా దాచార్యులు, నారాయణం శేషుబాబు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఊటుకూరి నాగేశ్వరరావు, సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి