నేత్రపర్వం.. శ్రీనివాసుడి రథోత్సవం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి దివ్య రధోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా అలంక రించిన రథంపై ఉభయదేవేరీ సమేతంగా స్వామిని ఊరేగిం చారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు నిర్వహణలో రధోత్సవం కనక తప్పెట్లు, మంగళ వాద్యాలు, విద్యుత్తు దీపకాంతులు, నామ సంకీర్తనలు, కర్ర సాము, కోలాటాలు, బాణసంచా వెలుగుల మధ్య బృందావన్ గార్డెన్స్ ప్రధాన వీధుల్లో సందడిగా సాగింది. శృంగేరి విరూపాక్ష శ్రీపీఠం పీఠాధిపతి గంభీరానంద భారతీ మహాస్వామి, నిర్వికల్పానందస్వామి, ధనకుధరం సీతారామానుజాచార్యస్వామి అనుగ్రహభాషణం చేశారు. సాహితీవేత్తలు ఎం.వి.సత్యవతి, ఏవీకే సుజాత బ్రహ్మోత్స వాల విశిష్టత వివరించారు. మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య, కుమార్ పంప్స్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, కారంశెట్టి లోకేశు సభలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సాహి తీవేత్త నోరి కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఊటుకూరి నాగే శ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సూరపనేని శ్రీరామచంద్రమూర్తి తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి