సంగీత సన్మండలి కృషి ప్రశంసనీయం
సంగీత, సాహిత్య, సేవా రంగాల్లో గాయత్రీ మహిళా సంగీత సన్మండలి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. బృందావన్ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం ముగింపు సభ జరిగింది. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వె. శేషురాణి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. డాక్టర్ కె. వీరన్ (విజయవాడ), ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ . మస్తానయ్య ప్రసంగిం చారు. సంస్థ సంచికను డాక్టర్ కె.వీరన్ ఆవిష్కరించారు. అనంతరం మల్లాది సింధురాగేశ్వరి (విజయవాడ) కు బంగారు పతకం ప్రదానం చేసి సత్కరించారు. సింధురాగేశ్వరి శాస్త్రీయ గాత్ర కచేరీలో పలు వాగ్గేయకారుల కృతులను గానం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సంస్థ ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏ.వీ. మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి