వైభవంగా బ్రహ్మోత్సవాలు
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. ముగింపు సంద ర్భంగా భారతీ ధార్మిక విజ్ఞాన విజ్ఞాన పరి షత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. పద్మా వతి అమ్మవారికి అభిషేకాలు, రాత్రి వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో పుష్పయాగం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాది పతి విద్యారణ్యభారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వంకా యలపాటి బలరామకృష్ణయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, ఆలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి