గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్న మయ్య కళావేదికపై శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సన్మండలి వార్షికోత్సవం జరిగింది. సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్ అన్నవరపు రామస్వామికి, మృదంగ విద్వాంసుడు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు, చిత్రవీణ విద్వాంసుడు డాక్టర్ ఎన్.రవికిరణ్ లను సన్మానించారు. కార్యక్రమాలను మోదుమూడి అంజనా సుధాకర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మాదల రత్నగిరిబాబు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ఎన్.రవికిరణ్ వీణ కచేరి జరిగింది. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి. విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణిల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. సంస్థ ప్రతినిధులు ఎమ్. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, మంగాదేవి, మాధ వీకృష్ణ విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి