ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అలరించిన తాళం భజన - శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు - 10.10.2026

అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ   పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
 నటరాజ సంగీత  నృత్య కళాశాల 19  వ వార్షికోత్సవ వేడుకలు  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికగా 05.11.2024   నటరాజ సంగీత  నృత్య కళాశాల 19  వ వార్షికోత్సవ వేడుకలు  నాట్యాచారిని ఏ. విజయకుమారి ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా జరిగిన సభా కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు, నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం  పాల్గొని కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  అనంతరం చిన్నారులు మహాగణపతిమ్, అనుక్షణం శివనామమే, తిల్లాన, శివపంచాక్షరీ స్తోత్రం, నటరాజ స్తోత్రం, కట్టెదుర వైకుంఠం, ఇదిగో భద్రాద్రి ,బ్రహ్మమొక్కటే , వినాయక కౌత్వం, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన అనే కూచిపూడి నృత్యాలు ,సూడ సక్కాని తల్లిం,  కొయిలార్ అనే జానపద నృత్యాలు చక్కటి హావ భావాల తో నృత్యాలను ప్రదర్శించి కళాభిమానులు అలరించారు. సీహెచ్. మస్తానయ్య మాట్లాడుతూ నాట్యాచారిణి విజయ కుమారి చేస్తున్న కృషిని ప్రశంసించారు...
విలక్షణ గ్రంథరాజము “మేఘదూతము’’ ప్రఖ్యాత రచయిత కొమాండూరు శ్రీరామచంద్రాచార్యుల వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న రంగనాథాచార్యులు మహాకవి కాళిదాసు సంస్కృత మూలం మేఘదూతమును ఆంధ్రాను వాదముతో గ్రంథస్తం చేసి - సఫలీకృతులవటం అభినందనీయమని తిరుప్పావై అమృతవర్షిణి గా   ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి పేర్కొన్నారు. 03.11.2024 ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై శ్రీ కొమాండూరు రామచంద్రాచార్యులు , శ్రీ కొమాండూరు రంగనాథచార్యులు ఆంధ్రానువాదం   చేసిన “మేఘదూతము” గ్రంథావి ష్కరణ సభ పలువురు కవులు , రచయితలు , పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం శిష్యునిగా రంగనాథచార్యులు వాస్తు , జ్యోతిష్యాలతో పాటు సాహిత్యం పరంగా కాళిదాసు విరచిత మేఘదూతము గ్రంధాన్ని ఆంధ్రనువాదం చేసి సాహిత్యం పై తను పట్టును నిలబెట్టుకున్నారని చెప్పారు. 1813 లోనే ఆంగ్ల రచయిత హెచ్.హెచ్. విల్సన్ మేఘదూతాన్ని సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి అనువదించారని కొనియాడారు. అమరావతి పబ్లికేషన్స్ వల్లూరి శివప్రసాద్...
ఆకట్టుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం ప్రదర్శన ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై 03.11.2024 ఆదివారం సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ సహకారంతో వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్త బృందం బ్రహ్మం గారి నాటకం ప్రదర్శించారు. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, సూరపనేని శ్రీరామచంద్రమూర్తి చౌదరి, సంస్థ వారు, భక్తులు జ్యోతిప్రకాశనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆలయ కమిటి సభ్యులు శ్రీరామచంద్రమూర్తి చౌదరి గారు వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్త బృందం వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం మహావిష్ణు, కాలజ్ఞాని, జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం రూపంలో భవిష్యత్ తరాల వారికి ప్రపంచంలో జరుగబోవు భవిష్యత్ సంఘటనలను తాళపత్ర నిధి రూపంలో అందించిన వాటిలో కొన్ని ముఖ్య ఘట్టములను బ్రహ్మం గారి నాటక రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు. విశేషంగా భక్తులు, ప్రేక్షకులు పాల్గొని నాటకాన్ని తిలకించారు.
ఆకట్టుకున్న ‘‘ప్రేమశిఖరం’’ పద్యనాటకం చిటిప్రోలు వెంకటరత్నం రచించిన ప్రేమశిఖరం పద్య నాటకాన్ని 02.11.2024 శనివారం రాత్రి ‘గుంటూరు తిరుమల’ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రదర్శించారు. సీహెచ్ జయప్రభ నిర్వహణలో నంది అవార్డు గ్రహీత , ప్రముఖ నాటక దర్శకుడు మామిడాల అర్జునరావు దర్శకత్వంలో హైదరా బాదు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వారు నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గౌతమ బుద్ధుని కాలంలో కులాల అంతరాలను ప్రశ్నిస్తూ వ్యక్తి ప్రేమ కంటే విశ్వ ప్రేమ గొప్పదని చాటిన ఒక సంఘటన ఆధారంగా ప్రేమశి ఖరం రూపుదిద్దుకుంది. ఆనంద భిక్షువును పద్య కావ్యంగా గతంలో డాక్టర్ వీవీఎల్ నరసింహం రచించారు. దాన్ని చిటిప్రోలు వెంకటరత్నం పూర్తిస్థాయి నాటకంగా మలిచి న్యాయం చేశారని దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య ఈసందర్భంగా జరిగిన సభలో వివరించారు. డమరుకం లలిత కళాసమితి ఆధ్వ ర్యంలో దర్శకుడు అర్జున్రావుకు రంగస్థల నాటకాగ్రేశ్వర బిరుదునిచ్చి సత్కరించారు. సభకు గన్నే వాసుదేవరావు అధ్యక్షత వహించారు. సభను వి.మల్లికార్జునాచారి , వి.ఎన్. విద్యాసాగర్ నిర్వహించారు. బుద్ధుడిగా ములుగు రామాచారి , ఆనం...
ఆకట్టుకున్న సంప్రదాయ సంగీత కచేరి భావి తరాలకు సంప్రదాయ సంగీతాన్ని అందించటమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ వైవీకే దుర్గాప్రసాదరావు అన్నారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తోన్న వాగ్గేయకార మహోత్సవాలు 27.10.2024 ఆదివారం ముగిశాయి. డాక్టర్ వై.శైలజ , ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సన్మండలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పి.విజయ , ఎంవై. శేషు రాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ దుర్గప్రసాదరావు మాట్లాడుతూ కొన్నాళ్లుగా సన్మండలి నిర్వహిస్తోన్న సేవలు ప్రశంస నీయమని అన్నారు. అనంతరం విదుషి కస్తూరి కమలదీప్తి (విశాఖపట్నం) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. వయోలిన్పై మందా శ్రీరమ్య(చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్ (చెన్నై) వాయిద్యాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి , ఎం.మీనాక్షి , పి.లలితదేవి , కార్యదర్శి ఎ.మంగాదేవి , కోశాధికారి ఎం. విజ...
వాగ్గేయకారుల మహోత్సవాలు – గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు , కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం , ( చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య , ( చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై) , ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం) , వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు , సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి , ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య , కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధా...
 శ్రీమద్భాగవతం – రుక్మిణీ కళ్యాణము ప్రవచనం ‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళ్యాణవేదికపై 21.10.2024 సోమవారం శ్రీమద్భాగవతం ధారావాహిక ప్రవచనాలలో భాగంగా బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ గారిచే రుక్మిణీ కళ్యాణము పై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యల్లాప్రగడ మల్లికార్జునరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కైలాసనాథ్ ప్రవచిస్తూ నేటి యువతరం ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమును శ్రద్ధగా చదివినా, విన్నా, పారాయణము చేసిన వారికి వివాహము జరగటమే కాక, చక్కటి వైవాహిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందన్నారు. ఈ విషయము ఆడపిల్లలకు మాత్రమే కాక మగపిల్లలకు కూడా వర్తిస్తుందన్నారు. భగవంతుని చేరకుండా అహంకార, మమకారములు అడ్డుపడుతాయన్నారు. అటువంటి పరిస్ధితులలో గురువుని ఆశ్రయించవలెనన్నారు. ఆ గురువు మనలను భగవంతుని వద్దకు చేర్చుతాడనీ అందలి విశేషాలను సవివరంగా తెలియజేశారు.