ఆకట్టుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి నాటకం ప్రదర్శన
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ
ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై 03.11.2024 ఆదివారం సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ సహకారంతో
వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్త బృందం బ్రహ్మం గారి నాటకం ప్రదర్శించారు. తొలుత
ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, సూరపనేని
శ్రీరామచంద్రమూర్తి చౌదరి, సంస్థ వారు, భక్తులు జ్యోతిప్రకాశనం చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆలయ కమిటి సభ్యులు శ్రీరామచంద్రమూర్తి చౌదరి
గారు వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్త బృందం వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం
మహావిష్ణు, కాలజ్ఞాని, జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
వారు కాలజ్ఞానం రూపంలో భవిష్యత్ తరాల వారికి ప్రపంచంలో జరుగబోవు భవిష్యత్ సంఘటనలను
తాళపత్ర నిధి రూపంలో అందించిన వాటిలో కొన్ని ముఖ్య ఘట్టములను బ్రహ్మం గారి నాటక
రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు. విశేషంగా భక్తులు,
ప్రేక్షకులు పాల్గొని నాటకాన్ని తిలకించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి