ఆకట్టుకున్న ‘‘ప్రేమశిఖరం’’ పద్యనాటకం
చిటిప్రోలు వెంకటరత్నం రచించిన ప్రేమశిఖరం పద్య నాటకాన్ని 02.11.2024 శనివారం రాత్రి ‘గుంటూరు తిరుమల’ బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రదర్శించారు. సీహెచ్ జయప్రభ నిర్వహణలో నంది అవార్డు గ్రహీత, ప్రముఖ నాటక దర్శకుడు మామిడాల అర్జునరావు దర్శకత్వంలో హైదరా బాదు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ వారు నాటకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గౌతమ బుద్ధుని కాలంలో కులాల అంతరాలను ప్రశ్నిస్తూ వ్యక్తి ప్రేమ కంటే విశ్వ ప్రేమ గొప్పదని చాటిన ఒక సంఘటన ఆధారంగా ప్రేమశి ఖరం రూపుదిద్దుకుంది. ఆనంద భిక్షువును పద్య కావ్యంగా గతంలో డాక్టర్ వీవీఎల్ నరసింహం రచించారు. దాన్ని చిటిప్రోలు వెంకటరత్నం పూర్తిస్థాయి నాటకంగా మలిచి న్యాయం చేశారని దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య ఈసందర్భంగా జరిగిన సభలో వివరించారు. డమరుకం లలిత కళాసమితి ఆధ్వ ర్యంలో దర్శకుడు అర్జున్రావుకు రంగస్థల నాటకాగ్రేశ్వర బిరుదునిచ్చి సత్కరించారు. సభకు గన్నే వాసుదేవరావు అధ్యక్షత వహించారు. సభను వి.మల్లికార్జునాచారి, వి.ఎన్. విద్యాసాగర్ నిర్వహించారు. బుద్ధుడిగా ములుగు రామాచారి, ఆనందుడుగా బి. నారాయణస్వామి, శివమానససురభి పాత్రలో వెంగమాంబ, వీరితోపాటు ప్రకృతి, ఆర్.ప్రియాంక, జ్ఞానేంద్ర ఎన్. గాబ్రియేలు తదితర 18 మంది నటీనటులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి