శ్రీమద్భాగవతం – రుక్మిణీ కళ్యాణము ప్రవచనం
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళ్యాణవేదికపై 21.10.2024 సోమవారం శ్రీమద్భాగవతం ధారావాహిక ప్రవచనాలలో భాగంగా బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ గారిచే రుక్మిణీ కళ్యాణము పై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యల్లాప్రగడ మల్లికార్జునరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కైలాసనాథ్ ప్రవచిస్తూ నేటి యువతరం ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టమును శ్రద్ధగా చదివినా, విన్నా, పారాయణము చేసిన వారికి వివాహము జరగటమే కాక, చక్కటి వైవాహిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందన్నారు. ఈ విషయము ఆడపిల్లలకు మాత్రమే కాక మగపిల్లలకు కూడా వర్తిస్తుందన్నారు. భగవంతుని చేరకుండా అహంకార, మమకారములు అడ్డుపడుతాయన్నారు. అటువంటి పరిస్ధితులలో గురువుని ఆశ్రయించవలెనన్నారు. ఆ గురువు మనలను భగవంతుని వద్దకు చేర్చుతాడనీ అందలి విశేషాలను సవివరంగా తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి