విలక్షణ గ్రంథరాజము “మేఘదూతము’’
ప్రఖ్యాత రచయిత కొమాండూరు శ్రీరామచంద్రాచార్యుల
వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న రంగనాథాచార్యులు మహాకవి కాళిదాసు సంస్కృత మూలం మేఘదూతమును
ఆంధ్రాను వాదముతో గ్రంథస్తం చేసి - సఫలీకృతులవటం అభినందనీయమని తిరుప్పావై అమృతవర్షిణిగా ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాత
ప్రవచనకర్త డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి పేర్కొన్నారు. 03.11.2024 ఆదివారం స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ పద్మావతి కళ్యాణ వేదికపై శ్రీ కొమాండూరు రామచంద్రాచార్యులు, శ్రీ కొమాండూరు రంగనాథచార్యులు ఆంధ్రానువాదం చేసిన “మేఘదూతము” గ్రంథావి ష్కరణ
సభ పలువురు కవులు, రచయితలు, పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత
వహించిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
శిష్యునిగా రంగనాథచార్యులు వాస్తు, జ్యోతిష్యాలతో పాటు
సాహిత్యం పరంగా కాళిదాసు విరచిత మేఘదూతము గ్రంధాన్ని ఆంధ్రనువాదం చేసి సాహిత్యం పై
తను పట్టును నిలబెట్టుకున్నారని చెప్పారు. 1813
లోనే
ఆంగ్ల రచయిత హెచ్.హెచ్. విల్సన్ మేఘదూతాన్ని సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి
అనువదించారని కొనియాడారు. అమరావతి పబ్లికేషన్స్ వల్లూరి శివప్రసాద్ గ్రంధావిష్కరణ
గావించారు. సభకు ద్విభాష రచయిత, కవి డాక్టర్ కోగంటి
విజయబాబు స్వాగతం పలుకుగా కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు
మస్తానయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్, అరసం జాతీయ అధ్యక్షులు
పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి, కే. కృష్ణమాచార్యులు,
శ్రీధరాచార్యులు
తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి