నటరాజ సంగీత నృత్య కళాశాల 19 వ వార్షికోత్సవ వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికగా 05.11.2024 నటరాజ సంగీత నృత్య కళాశాల 19 వ వార్షికోత్సవ వేడుకలు నాట్యాచారిని ఏ. విజయకుమారి ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభా కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు, నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకటసుబ్రహ్మణ్యం పాల్గొని కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులు మహాగణపతిమ్, అనుక్షణం శివనామమే, తిల్లాన, శివపంచాక్షరీ స్తోత్రం, నటరాజ స్తోత్రం, కట్టెదుర వైకుంఠం, ఇదిగో భద్రాద్రి ,బ్రహ్మమొక్కటే , వినాయక కౌత్వం, ఆధ్యాత్మిక రామాయణ కీర్తన అనే కూచిపూడి నృత్యాలు ,సూడ సక్కాని తల్లిం, కొయిలార్ అనే జానపద నృత్యాలు చక్కటి హావ భావాల తో నృత్యాలను ప్రదర్శించి కళాభిమానులు అలరించారు. సీహెచ్. మస్తానయ్య మాట్లాడుతూ నాట్యాచారిణి విజయ కుమారి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం కళాకారులకు మెమోంటోస్ బహుకరించారు. సంస్థ వారు అతిధులను సత్కరించారు. అనంతుల ప్రణయనాధ్ రెడ్డి, విజయకుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి