ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం - 04.11.2025

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుం తలం నృత్యరూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచి పూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయం చారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్రగుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.

వాగ్గేయకారుల మహోత్సవాలు గాయత్రీ మహిళా సంగీత సన్మండలి

‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావనగార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో వాగ్గేయకారుల మహోత్సవాలు 26.10.2027 శనివారం ప్రారంభమయ్యాయి. పి. జానకి జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. పెరవలి జయతి ప్రార్ధన అనంతరం స్థానిక విద్వాం సులు పలువురు వాగ్గేయకారుల వర్ణాలు, కృతుల గానం సంగీతాభిమానులను అలరించింది. ప్రధాన కచేరీలో భాగంగా విద్వాన్ వివేక్ మూజికులం, (చెన్నై) శాస్త్రీయ సంగీత కచేరి జరి గింది. కచేరీకి వయోలి న్పై మంధా శ్రీరమ్య, (చెన్నై), మృదంగంపై బుర్రా శ్రీరామ్(చెన్నై), ఘటం పై ఎస్.హను మంతరావు(తాడేపల్లి గూడెం), వాద్య సహకా రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు, సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. కార్యక్రమాలను డాక్టర్ జి. జాహ్నవి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు మస్తానయ్య, కార్యదర్శి ఉమామహేశ్వరరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పి. విజయ, ఎం.వై శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, ఎం.మీనాక్షి, పి. లలితదేవి, కార్యదర్శి ఎ. మంగాదేవి, కోశాధికారి ఎం. విజయలక్ష్మి, ఉప కార్యదర్శి ఎం.మాధవీ కృష్ణ ఆధ్వర్యంలో కళాకారులు, అతిథులకు సత్కారాలు జరిగాయి.











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.