ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

డాక్టర్ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం ప్రదానం - 12.07.2025

డాక్టర్ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో గానకళానిధి వింజమూరి వరదరాజ అయ్యంగార్ జయంతి సం గీత వేడుకలు నిర్వహించారు. వింజమూరి సం ధ్య (చెన్నై), త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కార్యదర్శి వల్లూరి కష్ణకిషోర్, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయవాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు సన్మండలి ఉపాధ్యక్షు రాలు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు విద్వాన్ ఏఎస్ మురళి (చెన్నై)కి డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం అందించి సత్కరించారు. సభానంతరం ఏఎస్ మురళి శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ్ల లలితాదేవి, కార్యదర్శి ఏ.వీ.మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతిథు లను సత్కరించారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి - 28,29.05.2025

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు. 

తెలుగు పంచకావ్యాలలో శృంగార నైషధం మొదటిది - 27.05.2025

తెలుగు పంచకావ్యాలలో శృంగార నైషధం మొదటిది శ్రీనాథ మహాకవి రచించిన శృంగార నైషధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో శృంగార నైషధముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీరంగనాయకి ప్రవచిస్తూ శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమకథను వర్ణిస్తుందన్నారు. నలరాజు, దమయంతిని వివాహం చేసుకున్న తర్వాత వారు కలిసే కథ ఇదని, ఈ కథను శ్రీహర్షుడు సంస్కృతంలో నైషధ మహాకావ్యంగా రాశాడన్నారు. శ్రీనాథుడు దాన్ని తెలుగులోకి అనువదించాడనీ, శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమను, వారి జీవితంలోని వివిధ సంఘటనలను అందంగా వర్ణిస్తుందని, కథలో నలరాజు, దమయంతి నరకయాత్రా కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో, వారు ఒకరినొకరు ఎలా మళ్లీ కలుసుకున్నారో వివరిస్తుందని తెలిపారు.

కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన - 26.05.2025

కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అవగాహన  కార్యక్రమం జరిగింది. డాక్టర్. ఆర్. విష్ణు ప్రసాద్, డాక్టర్ బి.కె. ప్రసన్నకుమార్ గార్లు కాలేయం, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధుల పట్ల తీసుకోవలసిన జగ్రత్తలు, సూచనలు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో చండీ హోమం - 25.05.2025

భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో ఆదివారం చండీ హోమం నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా విశ్వ శాంతిని కాం క్షిస్తూ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.

అలరించిన సినీ సంగీత విభావరి - 25.05.2025

అలరించిన సినీ సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతి స్వరసుధ రజతోత్సవ పంచమ భక్తి, సినీ, సంగీత విభావరి అధ్యక్షురాలు పత్రి నిర్మల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి గౌరవ అతిధులుగా ఛైర్పర్సన్, మహతీ స్వరసుధ వెనిగళ్ల విజయలక్ష్మి, సహస్ర జూవెలర్స్ దోగిపర్తి శ్రీహర్ష హంస జూవెలర్స్ దోగిపర్తి శ్రీచక్ర, ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, బండ్లమూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అలనాటి సినీగీతాలను పత్రినిర్మల, రసూల్ బాబు, సురభి శ్రావణి, రాజ్యలక్ష్మి, మనస్విని, హేమమాలిని, ప్రద్యుమ్న, వలి, వీరరాఘవ, కృష్ణ ప్రసాద్ అలనాటి సినీ గీతాలను మధురంగా ఆలపించి అభిమానులను అలరించారు. వీరికి కీబోర్డ్పైకే. రవిబాబు, తబలా పై ఎస్.వెంకట్, పాడ్స్ టి. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. పత్రినిర్మల, మదన్మోహన్రావు కళాకారులను, అతిధులను ఘనంగా సత్కరించారు. 

ఆకట్టుకున్న యక్షగాన ప్రదర్శన - 24.05.2025

ఆకట్టుకున్న యక్షగాన ప్రదర్శన త్యాగరాజ స్వామి దాదాపు రెండున్నర శతాబ్దాల నాడు కొన్ని ప్రదర్శనలిచ్చిన అపురూప యక్షగానం శని వారం రాత్రి ప్రదర్శితమైంది. ఈశ్వర వరప్రసాద పరిషత్తు ఆధ్వర్యంలో స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నాట్యాచార్య కాజ వెంకట సుబ్రహ్మణ్యం తన శిష్య బృందంతో కలిసి ప్రదర్శించారు. త్యాగయ్యగా కాజ వెంకట సుబ్ర హ్మణ్యం, విష్ణుమూర్తి పాత్రలో కొల్లి అక్షయ, లక్ష్మీదేవిగా దేవేంద్ర గాయత్రి, ప్రహ్లాద పాత్రలో బిక్కి తోషిత, నారదుడుగా కొర్లకుంట వైష్ణవి, సముద్రుడు పాత్రలో నాట్యా చార్య బాలు, గరుత్మంతుడుగా దొంతి రెడ్డి లక్ష్మి గోపిక, ద్వారపాలక పాత్రలో పూల భరణి పాల్గొన్నారు. రవికృష్ణ, దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య తది తరులు తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, చంద్రమోహన్, సత్యనారాయణరాజు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

సాహితీలోకం మరువలేని కవి ధనేకుల - 23.05.2025

సాహితీలోకం మరువలేని కవి ధనేకుల కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ లాంటి గొప్ప కవులతో సాన్నిహిత్యం కలిగి లలిత సుందర కవిత్వం రాసి గుంటూరు కవిగా పేరొందిన ధనేకుల వెంకటేశ్వరరావును సాహితీలోకం ఏనాటికీ మరువదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్ర సాద్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై ధనేకుల వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శుక్ర వారం రాత్రి జరిగింది. సభకు ఆలోకం పెద్ద బ్బయ్య అధ్యక్షత వహించారు. తొలుత ధనేకుల చిత్ర పటానికి ఆయన భార్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పద్యాన్ని పండిత పామరులందరూ ఆస్వాదించేలా పద్యకవిత్వం రాయడంలో ధనేకుల మేటి అన్నారు. సభలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్య నారాయణ, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, నాయుడు  గోపి, సుఖవాసి మల్లికార్జునరాయశాస్త్రి, నూతలపాటి తిరుపతయ్య. పెద్ది సాంబశివరావు, డాక్టర్ రావెల సాంబశివరావు, డాక్టర్ బీరం సుందరరావు, డాక్టర్ నరాలశెట్టి రవికుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ రావి రంగా రావు, డాక్టర్ పాపినేని శివశంకర్ తదితరులు ధనేకుల కవిత్వ విశేషాలు వివరించారు. కారుమంచి లీల...

విశేషంగా ఆకట్టుకున్నహనుమత్ వైభవ ప్రవచనం - 22.05.2025

విశేషంగా ఆకట్టుకున్నహనుమత్ వైభవ ప్రవచనం బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుజాత దంపతులచే ఆకుపూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. సుందరకాండలోని హనుమత్ వైభవంపై నారాయణమూర్తి ప్రసంగించారు.  సుందరకాండలోని ప్రతి అంశాన్నీ వాల్మీకి మహర్షి సుందరంగా వర్ణించారని చెప్పారు.స్వామికీ విశేష అభిషేకాలు, నాగవల్లి దళార్చన, అలంకరణతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య,ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కలిపురుషుని వృత్తాంతంపై ప్రవచనం - 21.05.2025

కలిపురుషుని వృత్తాంతంపై ప్రవచనం  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధ వారం మహాభారతంలోని అర ణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవ చనం జరిగింది. తొలుత ఆల య కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచ కులు గుదిమెళ్ళ శ్రీకూర్మనాధస్వామి ప్రవచిస్తూ మహాభారతం ప్రకారం కలి ఒక దుష్టదేవత అని పూర్వీకులైన కశ్యపముని పదిహేనో కుమారుడిగా జన్మించాడన్నారు. కలియుగ ప్రభువు గా కలి తన ప్రభావాన్ని పాపపు చర్యలను ప్రోత్సహించడానికి రాజు పరిక్షిత్తు మహారాజుని అడిగి పొందిన వర సహాయంతో జూదం, మద్యపానం, వ్యభిచారం, హత్య, బంగారం అనే ఐదు వ్యసనాలకు లోబడిన ప్రజలను ఆవహించి వారిని పతనం చేస్తాడన్నారు. ఆయన కథనంలో ఆయన చేత పీడించి, హింసించబడిన నల మహారాజు వంటి వ్యక్తులతో ముడిపడి ఉందన్నారు. మహాభారతంలో దుర్యోధనుడు ఆయన అవతారంగా పరిగణించబడ్డారన్నారు. 

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 19-21.05.2025

మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ మహాభారత కాలంలో మద్ర రాజ్యానికి వారసుడు శల్యుడనీ, శల్యునికి వారసత్వంగా మద్ర రాజ్యం వచ్చిన మాట నిజమే అయినా, ఆ రాజ్యాన్ని కాచుకోగల పరాక్రమం అతని సొత్తన్నారు. శల్యునికి ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్దం చేస్తారో...వారి మనసులో ఎంతటి క్రోధం ప్రబలుతూ ఉంటే, శల్యునికి అంతగా బలం చేకూరుతుందన్నారు. ధర్మరాజుకీ,శల్యునికీ మధ్య జరిగిన పోరులో అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ తుట్టతుదకు... ధర్మరాజు వదిలిన ఒక శూలంతో శల్యుడు నేలకూలక తప్పలేదన్నారు.అలా భారతంలో శల్యుని కథ ముగుస్తుందన్నారు. 

ఆకట్టుకున్న సంగీత రూపకం - 17,18.05.2025

ఆకట్టుకున్న సంగీత రూపకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్‌లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.