సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
నాగభైరవ స్మారక పురస్కారాల ప్రదానం సుప్రసిద్ధ సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కార ప్రదాన సభ బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం రాత్రి జరిగింది. ప్రముఖ విద్యావేత్త పెంట్యాల శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీవేత్తలు నూనె అంకమ్మరావు , డాక్టర్ సెట్లం చంద్రమోహన్‌లకు పురస్కారాలు అందజేశారు. సభకు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు. అధ్యక్షత వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో ఆత్మీయ అతిథులుగా డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ , నవ్యాంధ్ర తెలుగు రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు తేళ్ల అరుణ , మోదుగుల రవికృష్ణ , గాయకుడు నూకతోటి శర త్‌బా బు , డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.