తెలుగు భాష చమత్కారమయం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య సౌజన్యంతో రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసో సియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవం శుక్రవారం రాత్రి జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు డాక్టర్ మైలవ రపు లలితకుమారి అధ్యక్షత వహించారు. తెలుగుకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన అవధాన కళా సౌరభం గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, చాటుక విత్వ చమత్కారాల గురించి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వివరించారు. డాక్టర్ వేమూరి సత్యవతి తెలుగు భాషలో వారసత్వంగా తెలుగు జాతికి అందించిన పద సంపద, నుడికారాల గురించి వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి