స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలోని యాగశాలలో లక్ష్మీగణపతి, రుద్రా, చండి హోమాలు, మహా పూర్ణాహుతితో ముగిశాయి. బొల్లేపల్లి సత్యనారా యణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో ధార్మిక ప్రాంగణంలోని శివలింగానికి లంకా విజయబాబు, బొర్రా ఉమామహేశ్వరరావు, యడ్లపాటి అశోక్‌కుమార్, నూతలపాటి తిరుపతయ్య అభిషేకార్చన నిర్వహించారు.
బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో మహాశివ రాత్రి సందర్భంగా 12 గంటల నిర్విరామ నృత్యనీరాజన కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు శివపాద మంజీర నాదం-2 పేరున శివరాత్రి నృత్య జాగ రణ నిర్వహించారు. కార్యక్రమాన్ని డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్య నారాయణ, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో 108 మంది పాల్గొన్నారు. నాట్యచార్య డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం నృత్య దర్శకత్వంలో కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాన్ని వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్లూరి ధరణి, పూజితశ్రీ, మహిత పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి