ముగిసిన భాగవత ప్రవచనాలు
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సాహితీవేత్త పీ.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్ జయంతి సందర్భంగా భాగవత రస వైభవం పేరున భాగవత సప్తాహం ఆదివారం రాత్రి ముగిసింది. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ముగింపు ప్రవచనంలో రుక్మిణీ కల్యాణ నేపధ్యంలోని సాహిత్య, తాత్వికాంశాలను వివరించారు. కృష్ణునికి పంపే సందేశం ప్రణయ సందేశం వలె కనిపిస్తుందన్నారు. అనంతరం మంత్రాశ్రమ పీఠాధిపతి నరసింహానంద భారతీస్వామి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సీహెచ్. మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వర రావు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాప కుడు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీస మాఖ్య కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, సాహితీవేత్త నారాయణం శేషుబాబు, పి. రవికిషోర్, పి.హైమానంద తదితరులు పాల్గొని మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి