ఆకట్టుకున్న సంగీత రూపకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి జరిగిన పార్వతీ కల్యాణం సంగీత రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకుడు నూతలపాటి తిరుపతయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకులు కంభంపాటి సోదరులు కృష్ణఆదిత్య, కృష్ణశశాంక్‌లు పార్వతీదేవి జననం నుంచి పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చరియల్లో తీవ్రమైన తపస్సు తదితర అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు రూపక గానం చేశారు.
లంకా సేవలకు గుర్తింపు
గుంటూరు అన్నదాన సమాజం ఆడిటోరియంలో, ఆదివారం సాయంత్రం అన్నమయ్య గ్రంథాలయ పాలకులు లంకా సూర్యనారాయణ చేసిన సేవలకు గుర్తింపుగా మిరాకిల్ వరల్డ్ రికార్డును మిరాకిల్ సంస్థ జ్యారీ సభ్యులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అందించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత పంచాయితీ పరిషత్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రంధాలయంలోని పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలని కోరారు. మిరియాల ప్రసాదరావు, మద్దు వెంకటస్వామి, ఆర్.పి.ఎల్. నరసింహారావు,బండికల్లు జమదగ్ని, గాదె రత్నారెడ్డి తదితరులు లంకా వారు చేస్తున్న సేవలను ప్రస్తుతించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి