భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై వఝా రంగారావు, శేషారత్నం దంపతుల సౌజన్యంతో సోమవారం శ్రీమద్భగవద్గీత ద్వాదశ అధ్యాయం భక్తియోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అనన్యభక్తితో నిరంతము నిన్నే ధ్యానించుచూ, పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించేవారు, భక్తి భావముతో సేవించేవారు ఉన్నారన్నారు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులు ఎవరనగా శ్రీకృష్ణ పరమాత్ముడు నాయందు ఏకాగ్రచితులై, నిరంతరరము నా భజన ధ్యానములందు నిమగ్నులై, అత్యంత శ్రద్ధాభక్తులతో ననను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులని తెలియజేశారన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి